Thammineni Seetharam: ‘కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్’.. స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో వైకాపా శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ‘ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత? రాష్ట్ర శాసన సభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాను. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులు? దేశంలో చాలా మందికి హెచ్చరికలు, ముప్పు పొంచి ఉంది. వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా?’ అని ప్రశ్నించారు. ఇది సరైనది కాదని తమ్మినేని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!
-
MS Swaminathan: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్