CM Jagan Tour: జగన్‌ పర్యటన.. పత్తికొండలో విద్యుత్‌ కోతలు

నీడనిచ్చే వృక్షాలు నేలకూలుతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated : 30 May 2023 07:42 IST

నేలకూలుతున్న వృక్షాలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నీడనిచ్చే వృక్షాలు నేలకూలుతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్‌ మళ్లింపులు..గత రెండు మూడు రోజులుగా పత్తికొండ పట్టణంలో నెలకొన్న పరిస్థితి ఇది. రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు  ముఖ్యమంత్రి జగన్‌ జూన్‌ 1న కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుందరీకరణ, సౌకర్యాల కల్పన పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నారు. జూనియర్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు కోసం చుట్టు పక్కల విద్యుత్తు స్తంభాల మార్పు, తీగలు సరిచేస్తున్నారు. ఈ సమీపంలోని కాలనీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. కాలనీ ప్రజలు అవస్థలు పడ్డారు.

పత్తికొండ ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను, పెద్దపెద్ద కొమ్మలను తొలగించేస్తున్నారు. కొందరి ఇళ్ల వద్ద పెంచుకున్న చెట్లను సైతం  తొలగించడం విమర్శలకు దారితీస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని