సేవామూర్తి మండవ కుటుంబరావు హఠాన్మరణం
ప్రముఖ సేవాతత్పరుడు, రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మండవ కుటుంబరావు(67) సోమవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
విజయవాడ (చుట్టుగుంట), న్యూస్‌టుడే : ప్రముఖ సేవాతత్పరుడు, రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మండవ కుటుంబరావు(67) సోమవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చుట్టుగుంటకు చెందిన కుటుంబరావు.. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి నెలా పది టన్నుల కూరగాయలను ప్రత్యేక వాహనంలో పంపిస్తుంటారు. తిరుమల అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించేవారు. ఆయన భార్య కాశీ అన్నపూర్ణ గతంలో మృతి చెందగా.. ఆమె మైనపు విగ్రహాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని, ఆమె పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉన్న కుమార్తె సస్య.. వచ్చేంత వరకు కుటుంబరావు మృతదేహాన్ని రామలింగేశ్వరనగర్‌లోని స్వర్గపురిలో ఉంచి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం