కుల ధ్రువీకరణకు 40 ఏళ్లుగా పోరాటం!

ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు అనంతపురం గ్రామీణ మండలంలోని రాజీవ్‌కాలనీవాసులు. వీరంతా రాజ్‌గొండు తెగకు చెందినవారు.

Published : 30 May 2023 05:18 IST

ఈనాడు, అనంతపురం: ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు అనంతపురం గ్రామీణ మండలంలోని రాజీవ్‌కాలనీవాసులు. వీరంతా రాజ్‌గొండు తెగకు చెందినవారు. దాదాపు 40 ఏళ్ల కిందట ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధి కోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ వీరు ఏ కులానికి చెందినవారో అధికారులు తేల్చడం లేదు. కుల ధ్రువీకరణ లేకపోవటంతో  విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ తెగకు చెందినవారికి ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఎస్టీలుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని..ఇక్కడా అదేవిధంగా గుర్తించాలని బాధితులు కోరుతున్నారు. దాదాపు 75 కుటుంబాలు సోమవారం అనంతపురం కలెక్టరేట్‌కు వచ్చి స్పందన కార్యక్రమంలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని