ఉద్యోగ భద్రత కల్పించాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం
‘నైపుణ్య వికాసం’ ప్రాజెక్టులో పని చేసిన ముగ్గురు శిక్షకులు (ట్రైనర్లు) రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు.
జగన్ హామీ అమలు కోసం ‘నైపుణ్య’ ఉద్యోగుల ఆందోళన
తీవ్ర అస్వస్థతకు గురైన ఒకరు.. ఎయిమ్స్‌కు తరలింపు
ఈనాడు, అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘నైపుణ్య వికాసం’ ప్రాజెక్టులో పని చేసిన ముగ్గురు శిక్షకులు (ట్రైనర్లు) రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. తమకు న్యాయం చేయాలని రెండేళ్లుగా వీరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మరోసారి సమస్యను విన్నవించేందుకు శిక్షకులు సోమవారం తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయానికి తరలివచ్చారు. సజ్జల కార్యాలయం పక్కనే ఉన్న నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసి సమస్యను విన్నవించారు. కార్యాలయం ముందు బాధితులు ఆందోళన నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్, శ్రీనివాస్‌లు చీమల మందు కలిపిన శీతల పానీయం తాగి ఆత్మహత్య చేసుకోబోయారు. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
తీవ్ర అస్వస్థతకు గురైన రంజిత్‌కుమార్‌ను మంగళగిరి ఎయిమ్స్‌కి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. బాధితులు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద బైఠాయించి, కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. దీంతో కొంతమందిని సజ్జలతో మాట్లాడించేందుకు పోలీసులు తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర సమయంలో వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. దీంతో ఇందులో పని చేస్తున్న 854 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
రోడ్డున పడేశారు..
రాష్ట్రవ్యాప్తంగా 425 సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆంగ్ల భాష, జీవన నైపుణ్యాలు, ఐటీ, కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు గత ప్రభుత్వం 2018-19లో ‘నైపుణ్య వికాసం’ ప్రాజెక్టును చేపట్టి ఇందుకు 854 మందిని నియమించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి ఉద్యోగ భరోసా కల్పిస్తానని పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే 2021 మే 31 నుంచి ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. దీంతో శిక్షకులు రోడ్డున పడ్డారు. ఆంగ్ల భాష, జీవన నైపుణ్యాల శిక్షకులకు 6 నెలల జీతం, ఐటీ వారికి 9 నెలల జీతం పెండింగ్‌లో పెట్టారు.
విధాన నిర్ణయం తీసుకోవాలి
సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
అప్పట్లో ఎందుకు తీసుకున్నారో తీసుకున్నారు. ఆ తర్వాత బడ్జెట్ ఆగిపోయింది. శాశ్వత ఉద్యోగాలు కల్పించాలంటే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. సీఎం చెప్పినట్లు అవసరం ఉంది. ఏదో ఒకరకంగా తీసుకుంటాం. నైపుణ్యాభివృద్ధి విభాగంలోకి తీసుకోవాలా? విద్యాశాఖలోకి తీసుకోవాలా అన్నదానిపై ఆలోచన చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి