రాజకీయ క్రీడకు బలైన ‘రాజ’భవనాలు
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం.. ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మించాలని సంకల్పించింది.
న్యూస్‌టుడే, తుళ్లూరు: రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం.. ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మించాలని సంకల్పించింది. ‘అమరావతి’ మహా నగర నిర్మాణానికి వడివడిగా అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇచ్చారు. సర్కారు వెంటనే అసెంబ్లీ, సచివాలయం, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ పరిపాలన భవనాలు, హైకోర్టు, న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయస్థానం ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం భవన నిర్మాణాలను ప్రారంభించింది. వాటి నిర్మాణ పనులు వివిధ దశలకు చేరాయి. కొన్ని భవనాల్లో విద్యుత్, మంచినీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు మినహా మిగిలిన పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం రావడంతోనే అమరావతిలో పనులు నిలిచిపోయాయి. రూ. కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. కొద్దిపాటి ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించి వీటిని వినియోగంలోకి తీసుకొస్తే ప్రజాధనం ఆదా అవుతుంది. కానీ ప్రభుత్వ పెద్దలు ఆ ఆలోచనే చేయకపోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్