బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతల వినతి
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు నేతృత్వంలోని బృందం సోమవారం దిల్లీలో ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కలిసింది. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, క్రిమీలేయర్ ఎత్తివేయాలని, కులవృత్తులు కోల్పోయిన బీసీ కులాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రాయితీపై రుణాలు ఇవ్వాలని కోరారు. ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కలిసిన వారిలో సంఘం నాయకులు కర్రి వేణుమాధవ్, డాక్టర్ పద్మలత, పరశురాం తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)