4,500 మంది బదిలీ అవకాశం కోల్పోయినట్లే
జిల్లాల్లో అధికారుల నిర్వాకంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 4,500 మంది ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు.
కొలిక్కి రాని సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్
రెండో దశలో 5,500 మందికే ఖరారు
ఈనాడు, అమరావతి: జిల్లాల్లో అధికారుల నిర్వాకంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 4,500 మంది ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. రెండో దశలో 10 వేల మంది ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తదుపరి చర్యలు తీసుకోవాలని గత నెలలో కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన, పోలీసు కేసులు లేని వారందరి ప్రొబేషన్ ఖరారు చేసి జూన్ 1న కొత్త స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,500 మంది ప్రొబేషన్ ఖరారు చేశారు. మిగతా ఉద్యోగులకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం ఈ నెల 25న జారీ చేసిన జీవోలో ప్రొబేషన్ ఖరారైన వారే దరఖాస్తు చేసుకోడానికి అర్హులని స్పష్టం చేసింది. దీంతో రెండేళ్ల సర్వీసు పూర్తయి, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అనేక మంది ప్రొబేషన్ ప్రక్రియను అధికారులు ఇప్పటికీ పూర్తి చేయని కారణంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర జిల్లాల్లో ఇంకెన్నాళ్లు..?
జిల్లాయేతర కోటా కింద వేర్వేరు జిల్లాల్లో పని చేస్తున్న సచివాలయాల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పించని కారణంగా వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి, కుటుంబ సభ్యులు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నా, అవివాహితులు, వితంతులైన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి...జిల్లాయేతర ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఇంకెన్నాళ్లు పని చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
* సచివాలయాలు ఏర్పాటైన తర్వాత మొదటిసారి బదిలీలు చేస్తున్నందున ఇప్పటివరకు వేర్వేరు చోట్ల పని చేస్తున్న ఉద్యోగులు సొంత మండలాల్లో, పుర, నగరపాలక సంస్థల పరిధిలోని సచివాలయాలకు వెళ్లేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందుకోసం ఉద్యోగులకు సంబంధించిన వాట్సప్ గ్రూపుల్లో పరస్పర అంగీకార బదిలీల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. పరస్పర అంగీకార బదిలీకి ప్రాధాన్యమివ్వడంతో వీరంతా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్