Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్) అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది.
విచారణను నేటికి వాయిదా వేసిన అనిశా కోర్టు
ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్) అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.
* రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ... విజయవాడ అనిశా కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన