పది సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి

పదోతరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు.

Updated : 31 May 2023 05:37 IST

ఈనాడు, అమరావతి: పదోతరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 8.45 నుంచే అనుమతిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షలకు 2,12,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. గత ఏప్రిల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జవాబు పత్రాల మూల్యాంకనం జూన్‌ 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని