అన్న క్యాంటీన్‌కు చంద్రబాబు భూమి విరాళం

ఏడాదిగా పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్‌కు శాశ్వత భవన నిర్మాణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భూమిని విరాళంగా అందించారు.

Updated : 31 May 2023 06:03 IST

కుప్పంలో 20 సెంట్ల స్థలం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఏడాదిగా పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్‌కు శాశ్వత భవన నిర్మాణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భూమిని విరాళంగా అందించారు. కుప్పంలోని తెదేపా కార్యాలయ సమీపంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని ‘కుప్పం మా అన్న క్యాంటీన్‌ ట్రస్టు’కు విరాళంగా చంద్రబాబు అందచేశారని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మంగళవారం విలేకర్లకు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చినట్లు వివరించారు. వైకాపా అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టిందని విమర్శించారు. పేదల అవస్థలు చూసిన  చంద్రబాబు ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే సూచనతో మొదటగా కుప్పంలో ఏర్పాటు చేశారన్నారు. అనంతరం ఓట్ల కోసం వైకాపా నాయకులు రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, నిర్వహణ లేక గంగమ్మ జాతర సమయంలో మూసివేశారని తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న క్యాంటీన్‌.. తెదేపా అధికారంలో ఉన్నా, లేకున్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాతల సాయంతో రోజూ 500 మందికి భోజనం అందిస్తున్నామని చెప్పారు. క్యాంటీన్‌ భవనం నిర్మాణానికి గంగమ్మ దేవాలయ మాజీ ఛైర్మన్‌, కుప్పం మా అన్న క్యాంటీన్‌ ట్రస్టు ఛైర్మన్‌ రవిచంద్రబాబు రూ.5 లక్షలు విరాళంగా ఇటీవల జరిగిన మహానాడులో అందించినట్లు వారు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు