నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం దంపతులు

విజయవాడలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం సతీసమేతంగా సందర్శించారు.

Published : 31 May 2023 04:16 IST

నూతన భవనం ప్రారంభం

ఈనాడు, అమరావతి: విజయవాడలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం సతీసమేతంగా సందర్శించారు. ఆ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డయింగ్‌ డెస్టిట్యూట్స్‌’ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మదర్‌థెరెసా ప్రతిమకు పూలదండ వేశారు. భవనంలోని అన్ని గదులూ కలియతిరుగుతూ దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించారు. చిన్నారులు సీఎంకు పుష్పాలు అందించగా వాటిని ఆయన స్వీకరించారు. దాదాపు 40 నిమిషాలపాటు నిర్మల్‌ హృదయ్‌లో గడిపారు. ఇక్కడికి ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సతీమణి భారతీరెడ్డి కలిసి వచ్చారు. తిరిగి వెళ్లేసమయంలో వేర్వేరుగా బయలుదేరారు. భారతీరెడ్డి.. మరో కారులో గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి వెళ్లారు. సీఎం జగన్‌ నిర్మల్‌ హృదయ్‌ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు.

‘సాక్షి’కి మాత్రమే అనుమతి...

విజయవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉందని భద్రతా సిబ్బంది చెప్పారు. ప్రాంగణంలోకి వెళ్లిన వారిని కూడా బయటకు పంపించేశారు. సాక్షి ప్రతినిధులను మాత్రం అనుమతించడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని