నాలుగేళ్లలో 98 శాతానికి పైగా హామీల అమలు

‘దేవుని దయ, మీ అందరి దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మంగళవారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 98 శాతానికిపైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు చేశాం...’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Published : 31 May 2023 04:16 IST

సీఎం జగన్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ‘దేవుని దయ, మీ అందరి దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మంగళవారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 98 శాతానికిపైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు చేశాం...’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘వివిధ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంపై మీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా...’ అని జగన్‌పేర్కొన్నారు.

* ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఉన్నతాధికారులు మంగళవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కార్యదర్శులు కె.ధనుంజయ్‌రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా తదితరులు సీఎంను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని