వైకాపా నేతల కుట్రలను ఛేదించాలి: కూన

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు పన్నిన కుట్రకోణాన్ని పోలీసులు ఛేదించాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు కూన రవికుమార్‌ కోరారు.

Published : 31 May 2023 04:16 IST

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు పన్నిన కుట్రకోణాన్ని పోలీసులు ఛేదించాలని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు కూన రవికుమార్‌ కోరారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని తెదేపా కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. స్పీకర్‌పై ఫిర్యాదు అందచేశారు. కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘వైకాపా నేత జగన్‌ పన్నిన కుట్ర... తమ్మినేని మాటల ద్వారా బహిర్గతమైంది. దీని వెనుక కుట్ర కోణాన్ని బహిర్గతం చేయాలి’ అని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు