తూర్పుగోదావరిలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మీనాక్షి సమేత ఐశ్వర్య సుందరేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన మంగళవారం విచ్చేశారు.

Published : 31 May 2023 04:16 IST

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మీనాక్షి సమేత ఐశ్వర్య సుందరేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా హోమం, ఇతర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆయన వెంట కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ ఉన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు సోడదాసి మార్టిన్‌లూథర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, భక్తులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు