రాష్ట్రంపై ఉరుముతున్న వరుణుడు
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు రావచ్చని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అత్యధికంగా మాచర్ల మండలం కొప్పునూరులో 95 మి.మీ వర్షం
ఈనాడు, అమరావతి: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు రావచ్చని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో 95 మి.మీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కె.ఉప్పలపాడులో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
* బుధవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?