నిర్వాసితుల జీవనాధారంపై దృష్టిపెట్టాలి

పోలవరం ప్రాజెక్టు కింద తరలిస్తున్న నిర్వాసితులకు కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు అమలయ్యేలా అనుసంధానించాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.కె.ఝా ఆదేశించారు.

Published : 01 Jun 2023 03:40 IST

పోలవరం పునరావాసంపై సమీక్షలో ఆదేశం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కింద తరలిస్తున్న నిర్వాసితులకు కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు అమలయ్యేలా అనుసంధానించాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.కె.ఝా ఆదేశించారు. ప్రధానంగా నిర్వాసితుల జీవనాధారంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిర్వాసితుల జీవనాధారానికి ఐటీడీఏలు శ్రద్ధ చూపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్‌ హోదాలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఝా పాల్గొన్నారు. పునరావాస, భూసేకరణ కమిషనర్‌ అదనపు బాధ్యతల్లో ఉన్న ప్రవీణ్‌ ఆదిత్య, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలవరం తొలిదశలో ఇంకా 8,000 నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో వారి తరలింపునకు సంబంధించిన పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని ఝా ఆదేశించారు. నిర్వాసితుల నుంచి ఇప్పటివరకు అందిన 700 ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని