జూన్‌ 10 తర్వాత ఉద్యమం ఉద్ధృతం

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జూన్‌ 10వ తేదీ లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

Published : 01 Jun 2023 03:40 IST

ఏపీ జేఏసీ అమరావతి

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జూన్‌ 10వ తేదీ లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 84 రోజుల ఉద్యమంతో ఉద్యోగులకు రావాల్సిన బకాయిల్లో సుమారు రూ.6 వేల కోట్లను సాధించుకున్నామన్నారు. ఇంకా ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సీఎస్‌కు ఇచ్చిన 50 పేజీల వినతిపత్రంలోని సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. సమస్యలపై గురువారం చర్చించేందుకు సీఎస్‌ ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్‌, నాయకులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని