8న జమ్మూలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
జమ్మూలోని మజీన్ గ్రామంలో తితిదే నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం జూన్ 8న జరగనుంది.
తిరుమల, న్యూస్‌టుడే: జమ్మూలోని మజీన్ గ్రామంలో తితిదే నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం జూన్ 8న జరగనుంది. ఇందు కోసం 3వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8న ఉదయం 7.30-8.15 గంటల వరకు మిథున లగ్నంలో మహా సంప్రోక్షణ ఉంటుంది. 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సర్వాంగ సుందరంగా తితిదే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసింది. వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయం కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..