Tirumala Ghat Road: వాహనాలను నియంత్రించకుంటే నష్టమే.. తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు
తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు తితిదే అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. వేగనియంత్రణ లేకపోవడం, ఘాట్‌రోడ్డుపై అవగాహన లేమి, వాహనాల కండిషన్ సరిగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు తితిదే అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. వేగనియంత్రణ లేకపోవడం, ఘాట్‌రోడ్డుపై అవగాహన లేమి, వాహనాల కండిషన్ సరిగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. తిరుమలకు నిత్యం ద్విచక్ర, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో వచ్చి వెళ్తాయి. ఆర్టీసీ రోజుకు 1,500 ట్రిప్పులు నడుపుతోంది. కొవిడ్ తర్వాత సొంత వాహనాల్లో వచ్చేవారి సంఖ్య పెరిగింది. రోజూ 7,500 కార్లు వస్తున్నట్లు అంచనా. అయితే, ఇతర ప్రాంతాల వారికి ఘాట్‌రోడ్డుపై అవగాహన లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.
గతంలో అలా.. ఇప్పుడిలా
కొండ మీదకు వెళ్లే వాహనాలకు అలిపిరి వద్ద, కిందకు దిగేటప్పుడు జీఎన్‌సీ టోల్‌గేటు వద్ద రసీదుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేసేవారు. అలిపిరి నుంచి కొండకు వెళ్లేందుకు 28 నిమిషాలు, కొండ నుంచి అలిపిరికి 40 నిమిషాల సమయాన్ని నిర్దేశించారు. వీటిని టోల్‌గేట్ల వద్ద స్కాన్ చేసి, ఇంకా ముందుగా వస్తే జరిమానా విధించేవారు. ఒకటి కంటే ఎక్కువసార్లు నిబంధనలు అతిక్రమించిన వాహనాలను కొండ మీదకు రాకుండా నిషేధించేవారు.
* ఇప్పుడు వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ రావడంతో రసీదు లేకుండానే వెళ్తున్నాయి. దీంతో వాహనచోదకులు వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేసి, టోల్‌గేట్ల వద్ద వేగ నియంత్రణను పరిశీలించే చర్యలు చేపడితే ప్రమాదాలను కొంతవరకు నియంత్రించవచ్చు.
ఈ ప్రాంతాల్లోనే అధికం
సామర్థ్యం లేని వాహనాలను తిరుమలకు తిప్పడం.. వాటికి దిగువ కనుమదారిలో బ్రేకులు పడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండో కనుమదారి (ఎగువ ఘాట్‌రోడ్డు)తో పోలిస్తే మొదటి కనుమదారిలోనే ప్రమాదాలు ఎక్కువ. మొదటి ఘాట్‌రోడ్డులో 58 మలుపులు ఉన్నాయి. ఇందులో 36 వరకు హెయిర్ పిన్ మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా ఏడో మైలురాయి, 35 నుంచి ఆరో మలుపు వరకు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. కొండ దిగేటప్పుడు బ్రేకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అప్పుడు బ్రేక్ భాగం వేడెక్కి.. ఫెయిలయ్యే ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల చాలా నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.
* ఎగువ కనుమదారిలో ఎక్కువగా వ్యూపాయింట్లు, హరిణి వద్ద ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొండకు చేరేముందు స్వామి రూపంలో ఉన్న రాతి విగ్రహం వద్ద వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. సామర్థ్యం లేని వాహనాలు సైతం ఘాట్‌రోడ్డులో తిరగడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఎక్కువ ప్రమాదాలు తూఫాన్, టెంపో లాంటి వాహనాలకే జరుగుతున్నట్లు గుర్తించారు. వీటిని నియంత్రించేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ్య 15 ఏళ్లు దాటిన వాహనాలను కొండ మీదకు వెళ్లకుండా చూసేందుకు అధికారులు యోచిస్తున్నారు. మొత్తంగా ఘాట్‌రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. దీనిపై తగిన చర్యలు అమలు చేస్తే.. ప్రమాదాలను నియంత్రించేందుకు ఆస్కారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా