అదానీ గంగవరం పోర్టు కార్మికుల నిరసన

కార్మిక సమస్యల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్మికులు డిమాండ్‌ చేశారు.

Published : 01 Jun 2023 03:45 IST

విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), న్యూస్‌టుడే: కార్మిక సమస్యల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్మికులు డిమాండ్‌ చేశారు. బుధవారం విశాఖలోని గాజువాక సమీప పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రం నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో గంగవరం పోర్టు కార్మిక కుటుంబాలతోపాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అఖిలపక్ష పార్టీల నాయకులు చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు, దల్లి గోవిందరెడ్డి, ఎం.జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలని, కొత్త డీఏ, బేసిక్‌ ప్రకటించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో పోర్టు యాజమాన్య ప్రతినిధులు స్పందించి జూన్‌ 7లోపు పరిష్కరిస్తామని సమాచారం అందించారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని