వైద్యుల బయోమెట్రిక్ హాజరుపై ఎన్‌ఎంసీ ఆక్షేపణ
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల బయోమెట్రిక్ హాజరు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు కాకపోవడంపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆక్షేపణ తెలియచేసింది.
తమ పోర్టల్‌లో నమోదు కావట్లేదని వెల్లడి
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల బయోమెట్రిక్ హాజరు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు కాకపోవడంపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆక్షేపణ తెలియచేసింది. దేశవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు హాజరు నమోదు చేస్తే ఆ వివరాలు ఎన్‌ఎంసీ పోర్టల్‌కు వెళ్లే విధంగా ఏర్పాట్లు జరిగాయి. అయితే రాష్ట్రంలోని పలు బోధనాసుపత్రుల నుంచి వైద్యుల బయోమెట్రిక్ హాజరు వివరాలు ఎన్‌ఎంసీ పోర్టల్‌లో నమోదు కావడంలేదు. వీటి ఆధారంగానే ఆసుపత్రులు, వైద్య కళాశాలల పనితీరును ఎన్‌ఎంసీ అంచనా వేస్తుంది. సీట్ల పెంపు ప్రతిపాదనలపై బోధనాసుపత్రులను ఇటీవల సందర్శించిన ఎన్‌ఎంసీ బృందాలు పోర్టల్‌లో వైద్యుల హాజరు నమోదు కావడం లేదని గుర్తించారు. దీనిపై అందిన నివేదికను పరిశీలించి ఎందుకిలా జరుగుతోందని బోధనాసుత్రుల వారిని ఎన్‌ఎంసీ ప్రశ్నించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తిందని అధికారులు ఎన్‌ఎంసీకి డీఎంఈ అధికారులు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)