పేదలకు విద్యుత్‌ ఆదాచేసే ఉపకరణాలు

పేదల కోసం నిర్మించే ఇళ్లకు విద్యుత్‌ను ఆదాచేసే ఉపకరణాలను అందించేందుకు నిర్ణయించామని, అందువల్ల మార్కెట్‌ కంటే తక్కువ ధరకు వాటిని తమకు విక్రయించాలని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)ను గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ కోరారు.

Published : 01 Jun 2023 05:16 IST

ఈఈఎస్‌ఎల్‌ సహకారంతో అమలు

ఈనాడు, అమరావతి: పేదల కోసం నిర్మించే ఇళ్లకు విద్యుత్‌ను ఆదాచేసే ఉపకరణాలను అందించేందుకు నిర్ణయించామని, అందువల్ల మార్కెట్‌ కంటే తక్కువ ధరకు వాటిని తమకు విక్రయించాలని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)ను గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ కోరారు. గృహ నిర్మాణ శాఖ, ఈఈఎస్‌ఎల్‌ అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘ఎల్‌ఈడీ బల్బులు, ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, ఇంధన సామర్థ్య ఫ్యాన్‌లను రాయితీ ధరకు అందించే అంశాన్ని ఈఈఎస్‌ఎల్‌ అధికారులు పరిశీలించాలి. లబ్ధిదారులకు 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్లను అందించాలని నిర్ణయించాం. దీనివల్ల ఒక్కొక్క ఇంటికి ఏటా 734 యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. వాటిని ఈఈఎస్‌ఎల్‌ ద్వారా సమకూర్చడానికి అవసరమైన మొత్తాన్ని అడ్వాన్సుగా చెల్లిస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఈఈఎస్‌ఎల్‌ తరఫున ఇద్దరు అధికారులను అందుబాటులో ఉంచుతామని సంస్థ సీఈవో విశాల్‌కపూర్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు