గందరగోళం లేకుండా సింగిల్‌ సబ్జెక్ట్‌ విధానం

డిగ్రీ స్థ్థాయిలో ప్రస్తుతం అమలులో ఉన్న త్రీ మేజర్‌ (మూడు సబ్జెక్టులు చదివే పద్ధతి) స్థానంలో సింగిల్‌ మేజర్‌ విధానాన్ని (ఒక సబ్జెక్టు మేజర్‌గా మరో సబ్జెక్ట్‌ మైనర్‌గా చదివే పద్ధతి) అమలు చేసే విషయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

Published : 01 Jun 2023 05:16 IST

కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌

ఈనాడు, అమరావతి: డిగ్రీ స్థ్థాయిలో ప్రస్తుతం అమలులో ఉన్న త్రీ మేజర్‌ (మూడు సబ్జెక్టులు చదివే పద్ధతి) స్థానంలో సింగిల్‌ మేజర్‌ విధానాన్ని (ఒక సబ్జెక్టు మేజర్‌గా మరో సబ్జెక్ట్‌ మైనర్‌గా చదివే పద్ధతి) అమలు చేసే విషయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో మే 30న ‘ప్రభుత్వ డిగ్రీలో సింగిల్‌ సబ్జెక్టు కల్లోలం’ శీర్షికతో వెలువడిన వార్తపై ఆయన వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రంలోని 166 ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో కొత్త విధానాన్ని అమలు చేయడానికి జోన్ల వారీగా బాధ్యులతో సమావేశాలు నిర్వహించి తగు మార్గదర్శకాలు జారీ చేశాం. 2023-24 సంవత్సరంలో కొత్తగా చేరబోయే విద్యార్థులకు కొత్త విధానంపై అవగాహన కల్పించేలా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు సరిపోకపోతే ఉదయం ఆర్ట్స్‌, కామర్స్‌, మధ్యాహ్నం సైన్స్‌ గ్రూపులను షిఫ్ట్‌ పద్ధతిలో నడిపేలా ప్రతిపాదించాం. సంబంధిత సబ్జెక్టులను బోధించే అధ్యాపకుల కొరతను అధిగమించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం’ అని పోలా భాస్కర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని