వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి (వీఆర్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు.

Published : 01 Jun 2023 05:16 IST

వీఆర్‌పీఎస్‌ డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి (వీఆర్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వీఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. తీర్మానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు సభలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీక్షకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాల్మీకి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. వీఆర్‌పీఎస్‌ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని