Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో కూలిన వందల ఏళ్ల నాటి వృక్షం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది.

Updated : 02 Jun 2023 12:43 IST

మీద పడి ఒకరి మృతి

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న ఆ భారీ వృక్షం.. గాలివానకు మొదలు రెండు ముక్కలుగా చీలి అక్కడ ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటనలో కడపకు చెందిన రిమ్స్‌ విశ్రాంత ఉద్యోగి డా.రాయదుర్గం గుర్రప్ప(72) తలకు గాయమై అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుమార్తె శ్రీ రవళి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తుంటడంతో.. ఆమెను చూడటానికి గుర్రప్ప తిరుపతి వచ్చారు. అనంతరం కుమార్తెతో కలిసి దర్శనానికి రాగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మృతదేహం వద్ద కుమార్తె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. అంతకు ముందు ఆలయంలో వాహనసేవకు వచ్చిన ఏనుగులు.. ఘటన జరిగిన సమయంలో పెద్దగా ఘీంకారం చేయడంతో సిబ్బంది వాటిని అదుపు చేశారు.

రూ.5 లక్షల పరిహారం: ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.అయిదు లక్షల పరిహారం అందిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని