Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?

రాజధాని అమరావతిలోని సీఆర్‌డీఏ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరు, మందడం, నిడమర్రు, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు వద్ద 5,024 టిడ్కో ఇళ్లను నిర్మించారు.

Updated : 02 Jun 2023 07:08 IST

రాజధాని అమరావతిలోని సీఆర్‌డీఏ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరు, మందడం, నిడమర్రు, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు వద్ద 5,024 టిడ్కో ఇళ్లను నిర్మించారు. ప్రస్తుత పాలకులు వాటిలో మౌలిక వసతులు కల్పించకుండా ఇన్నాళ్లు వదిలేశారు. ఇటీవల వసతుల కల్పన మొదలుపెట్టారు. ఆ పనులు పూర్తికాకుండానే.. మే 26న సీఎం జగన్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మంచినీరు, రోడ్లు, విద్యుత్తు, డ్రెయినేజీ వ్యవస్థ పనులు పూర్తి కాకుండానే.. గృహప్రవేశాలు చేయాలని అధికారులు లబ్ధిదారులను త్వరపెట్టారు. రెండు రోజుల కిందటా లబ్ధిదారులు వచ్చి ఇళ్లు చూసుకొని.. పనులేవీ కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వెంటనే పూర్తి చేస్తాం మీరు వచ్చేయండి’ అని అధికారులు చెప్పడంతో వారిని నమ్మి లబ్ధిదారులు కొందరు పెనుమాకలోని ఇళ్లలోకి గురువారం సామగ్రితో దిగారు. పనులు పూర్తికాకపోవడంతో పాలు పొంగించి వెళ్లిపోయారు. అసలు.. సీఎం పూర్తయిన ఇళ్లు ప్రారంభించారా.. లేక పనులు ప్రారంభించారా అని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు.         

ఈనాడు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని