రాజకీయ ఉద్దేశాలతో ప్రజల్ని వేరు చేయొద్దు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ప్రాంతాల వారిని వేరు చేసి చూడకూడదని, రాజకీయ ఉద్దేశాలతో అలా చేయడం తగదని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి
చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ప్రాంతాల వారిని వేరు చేసి చూడకూడదని, రాజకీయ ఉద్దేశాలతో అలా చేయడం తగదని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగువారందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సరైన పరిపాలన లేక, అన్యాయాన్ని సహించలేకే ప్రజలు రాష్ట్రాల విభజన కోరుతున్నారని అన్నారు. తెలంగాణ కూడా ఇలా వచ్చిందేనని తెలిపారు. ఇలాంటి విభజనలు కేవలం ప్రజా సంక్షేమం కోసం పరిపాలన వరకే జరుగుతాయని, కానీ దురదృష్టవశాత్తు రాజకీయ ఉనికి కోసంగా మారుతున్నాయన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ వైరుధ్యం వస్తోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. భేదభావాలు పక్కనపెట్టి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ తరహా వేడుకలు అన్ని యూనివర్సిటీల్లోనూ జరగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు సంఘాల ఐక్య ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ టంగుటూరి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, కళాసుధ తెలుగు సంఘం అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.కె.ముత్తువేల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం