వంతెన ప్రమాదకరం.. వదలని ప్రచారం!

వంతెన శిథిలమై.. ఓ వైపు రెయిలింగ్‌ కూలిపోతోంది. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Published : 03 Jun 2023 05:13 IST

వంతెన శిథిలమై.. ఓ వైపు రెయిలింగ్‌ కూలిపోతోంది. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవేం పట్టని వైకాపా నాయకులు అదే రెయిలింగ్‌ దిమ్మెలకు పార్టీ జెండా రంగులు వేశారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలో బందరు కాల్వపై ఈ శిథిల వారధి ఉంది. సగం రెయిలింగ్‌ కూలిపోయింది. దాని మీది నుంచే దేవరపల్లి, చాగంటిపాడు, పెనమకూరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటు నుంచే రైతులు చెరకును ఉయ్యూరులోని ఫ్యాక్టరీకి తరలిస్తారు. అప్పుడప్పుడు వాహనాలు కాల్వలో పడుతుండటం వల్ల స్థానికులే చొరవ తీసుకొని తాటి మొద్దును అడ్డుగా పెట్టుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వంతెనను మరమ్మతులు చేయించాల్సిన నాయకులు రంగులతో సరిపెట్టడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

ఈనాడు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు