ఎన్టీటీపీఎస్‌లో 8వ యూనిట్‌ ప్రయోగాత్మక పరిశీలన

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం (ఎన్టీటీపీఎస్‌)లో నిర్మాణం పూర్తి చేసుకున్న 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిదో యూనిట్‌ను శుక్రవారం లైటప్‌ చేసి ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్‌రన్‌) జరిపారు.

Published : 03 Jun 2023 05:13 IST

800 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తిని పరీక్షించిన ఉన్నతాధికారులు
ఆగస్టు నుంచి వాణిజ్య ఉత్పత్తి: జెన్‌కో

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే - ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం (ఎన్టీటీపీఎస్‌)లో నిర్మాణం పూర్తి చేసుకున్న 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిదో యూనిట్‌ను శుక్రవారం లైటప్‌ చేసి ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్‌రన్‌) జరిపారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్‌కో ఛైర్మన్‌ విజయానంద్‌, జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబులు కార్యక్రమానికి హాజరై లైటప్‌ చేసి (బొగ్గును మండించి) ఉత్పత్తి పరీక్షను నిర్వహించారు. ఇది విజయవంతం కావడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన పనులు పూర్తి చేసి ఆగస్టు నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని జెన్‌కో ఛైర్మన్‌ విజయానంద్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ జెన్‌కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్‌ రఫీ, సత్యనారాయణ, ఆంథోనీ, వీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీరు, ఎస్‌ఈలు పాల్గొన్నారు. వీటీపీఎస్‌ అయిదో దశ కింద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిదో యూనిట్‌ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. సూపర్‌ క్రిటికల్‌ సాంకేతికతతో చేపట్టిన దీని అంచనా వ్యయం రూ.1500 కోట్లు. 2020 నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కొవిడ్‌తో పనుల్లో జాప్యం జరిగింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని