గతంలో రూ.వెయ్యి జరిమానా... నేడు రూ.20 వేలు చేశారు
గతంలో రూ.వెయ్యి ఉన్న ఓవర్ హైట్ కేసుల జరిమానాను నేడు రూ.20 వేలు చేశారని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు వివరించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
ఈనాడు డిజిటల్, అమరావతి : గతంలో రూ.వెయ్యి ఉన్న ఓవర్ హైట్ కేసుల జరిమానాను నేడు రూ.20 వేలు చేశారని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. డీజీల్, పెట్రోల్‌పై రోడ్డు సెస్ వసూలు చేస్తున్నా...రహదారులకు మాత్రం మరమ్మతులు చేయడం లేదని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వారు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ‘‘కరోనా సమయంలో లారీ యజమానులకు అన్ని రాష్ట్రాలు క్వార్టర్ టాక్స్ మినహాయింపు ఇస్తే.. ఏపీలో మాత్రం ఇవ్వలేదు. రూ.200 ఉన్న హరిత పన్నును రూ.20 వేలు చేశారు. దీంతో రాష్ట్ర రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది...’’ అని పేర్కొన్నారు. తెదేపా మేనిఫెస్టోలో రవాణా రంగాన్ని ఆదుకునేలా నిర్ణయాలు ప్రకటించాలని వారు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు
-
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిపివేత