సరిహద్దు ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారు ఉన్నారా అనే వివరాలను వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలి
రైలు ప్రమాదంపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
ఈనాడు, అమరావతి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారు ఉన్నారా అనే వివరాలను వెంటనే సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సహాయ సహకారాలను అందించేందుకైనా సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సేవల కోసం ఒడిశా సరిహద్దులోని మన రాష్ట్రానికి చెందిన ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని, అవసరమైతే ఘటనాస్థలికి పంపేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. రైలు ప్రమాదంపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలానికి మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం వెళ్లాలని సీఎం ఆదేశించారు. ‘సంబంధిత కలెక్టర్ కార్యాలయాల్లో విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల పరిస్థితులపై ఆరా తీయడానికి, ఎవరైనా ప్రయాణికుల బంధువులు, సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించడానికి ఈ కేంద్రాలు పని చేయాలి’ అని సీఎం చెప్పారు. అంతకు ముందు రైలు ప్రమాదంపై సీఎం జగన్ ట్వీట్‌లో తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు.
బాలేశ్వర్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు మంత్రి అమర్‌నాథ్ పరామర్శ
విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఒడిశాలో రైలు ప్రమాదంలో గాయపడి బాలేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి చేరుకున్న ఆయన వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 11 మంది క్షతగాత్రులను గుర్తించామని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు