గ్రామ సభల్లో ఆస్తి హక్కును ధ్రువీకరించుకోవాలి

వైఎస్‌ఆర్‌ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా 263 గ్రామాల్లో శనివారం నుంచి ప్రారంభమైన గ్రామ సభల్లో ప్రజలు పాల్గొని తమ ఆస్తి హక్కును ధ్రువీకరించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్‌ఆర్డీ) కమిషనర్‌ ఎ.సూర్యకుమారి శనివారం ఓ ప్రకటనలో సూచించారు.

Published : 04 Jun 2023 03:52 IST

ప్రజలకు పీఆర్‌ఆర్డీ కమిషనర్‌ సూచన

ఈనాడు, అమరావతి: వైఎస్‌ఆర్‌ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా 263 గ్రామాల్లో శనివారం నుంచి ప్రారంభమైన గ్రామ సభల్లో ప్రజలు పాల్గొని తమ ఆస్తి హక్కును ధ్రువీకరించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్‌ఆర్డీ) కమిషనర్‌ ఎ.సూర్యకుమారి శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఆస్తి యాజమాన్య హక్కు నిర్ధారించే ‘రికార్డు ఆఫ్‌ రైట్స్‌’ (ఆర్వోఆర్‌) ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. యజమానులు తమ ఆస్తులకు సంబంధించి ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌ నంబర్‌, ఆస్తి పన్ను చెల్లింపు వివరాలు, తమ వద్ద ఉండే ఏదైనా చట్టపరమైన ఆస్తి పత్రాలు, ఆధార్‌ కార్డు మొదలైనవి గ్రామసభల్లో అధికారులకు అందజేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని