46,445 కనెక్షన్లకు ఆక్వా విద్యుత్తు రాయితీ

రాష్ట్రంలోని మొత్తం 63,754 ఆక్వా విద్యుత్తు కనెక్షన్లలో 46,445 కనెక్షన్లకు రాయితీకి అర్హత ఉందని గుర్తించినట్లు ఇంధనశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 04 Jun 2023 03:52 IST

‘ఈనాడు’ కథనంపై వివరణ ఇచ్చిన ఇంధనశాఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 63,754 ఆక్వా విద్యుత్తు కనెక్షన్లలో 46,445 కనెక్షన్లకు రాయితీకి అర్హత ఉందని గుర్తించినట్లు ఇంధనశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆక్వా రైతు బరువయ్యాడా?’ శీర్షికన శనివారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై ఆ శాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులై 2019 నుంచి అన్ని ఆక్వా కనెక్షన్లకు యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కు సరఫరా చేయగా.. 2022 జులై నుంచి ఆక్వా జోన్లలో పదెకరాలలోపు చెరువులకే రాయితీ విద్యుత్తు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంది. పదెకరాల పైబడి విస్తీర్ణమున్న 17,309 కనెక్షన్లకు యూనిట్‌ రూ.3.85 చొప్పున సరఫరా చేస్తున్నామని తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని