80 మంది శానిటరీ కార్యదర్శులకు తాఖీదులు

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 80 మంది శానిటరీ కార్యదర్శులకు అధికారులు తాఖీదులు (షోకాజ్‌ నోటీసులు) జారీ చేశారు.

Published : 04 Jun 2023 03:52 IST

కాకినాడ(బాలాజీచెరువు), న్యూస్‌టుడే: కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 80 మంది శానిటరీ కార్యదర్శులకు అధికారులు తాఖీదులు (షోకాజ్‌ నోటీసులు) జారీ చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విధులు నిర్వహించలేమని, యూజర్‌ ఛార్జీల వసూలు లక్ష్యాలు విధించి వేధింపులకు పాల్పడవద్దని వీరంతా గత నెల 30న కమిషనర్‌ మహేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వార్డు సచివాలయంలోని మిగతా ఉద్యోగులకు మాదిరిగానే నిర్దేశించిన వేళల్లో మాత్రమే విధులు నిర్వర్తిస్తామని అందులో పేర్కొన్నారు. ఆ ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి అదే సమయం పాటిస్తున్నారు. దీంతో 80 మందికి శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు మాట్లాడుతూ జాబ్‌ఛార్ట్‌ ప్రకారమే వారికి సమయపాలన నిర్ణయించామన్నారు. ఉదయం 5.30 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిర్దేశించిన వేళల్లో విధులకు హాజరుకాకపోయినా, యూజర్‌ ఛార్జీలు వసూలు చేయకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని