6న పోలవరానికి సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న పోలవరం రానున్నారు. ఆ రోజు ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో వస్తారు.
ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న పోలవరం రానున్నారు. ఆ రోజు ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో వస్తారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లను పరిశీలిస్తారు. స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ తదితర ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు వద్ద సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు.
పనులు పరిశీలించిన మంత్రి అంబటి
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం పరిశీలించారు. మధ్యాహ్నం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి అక్కడ జల వనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించనుండటంతో బందోబస్తు పరిశీలనకు వచ్చిన మంత్రి ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని కలిశారు. సాయంత్రం గోదావరి మధ్యలో డయాఫ్రం వాల్ ప్రాంతంలోని గోతుల్లో ఇసుక నింపే పనులను పరిశీలించారు. ఆయన వెంట సీఈ బి.సుధాకరబాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, ఈఈ వెంకటరమణ, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులున్నారు. మీడియా ప్రతినిధులకు అనుమతి లేదంటూ పోలీసు చెక్‌పోస్టు వద్ద నిలువరించడంతో వారు వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!