YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రశ్నించిన అధికార పార్టీ కార్పొరేటర్ క్రాంతికుమార్‌పై కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిధులపై ప్రశ్నించినందుకు ఆగ్రహం
కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రశ్నించిన అధికార పార్టీ కార్పొరేటర్ క్రాంతికుమార్‌పై కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్రాంతికుమార్ మాట్లాడుతూ తన డివిజన్‌కు నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. ఆగ్రహించిన మేయర్ రామయ్య.. ‘ఇష్టానుసారంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తా. ఓవరాక్షన్ చేయకు. అతణ్ని లాగి పడేయండి. ఈడ్చేయండి’ అని పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను బయటకు తీసుకెళ్లేందుకు రాగా.. ‘మా డివిజన్‌లో అభివృద్ధి జరగలేదు. మేయర్ డివిజన్‌లో రూ.7 కోట్లతో పనులుచేస్తే మాకు అరకొరగా నిధులిచ్చారు. నేను ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధిని. ఏం తప్పు చేశానో చెప్పాలి’ అని నిలదీశారు. సహచర కార్పొరేటర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మేయర్ వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
డిప్యూటీ కమిషనర్‌కు అవమానం
నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రమాదేవి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి ఓ లేఖను చదివి, మేయర్‌కు ఇచ్చారు. రమాదేవి సమాధానమిస్తూ ‘నేను విధుల్లో ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించానో చెప్పాలి. విక్రమసింహారెడ్డి ఉదయం 5 గంటలకు ఫోన్ చేసినా స్పందించాను. ఉద్దేశపూర్వకంగానే అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ ఆరోపణలు చేయిస్తున్నారు. పురుషుల మధ్యలో కూర్చోవాలని అంటుంటారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు’ అని వాపోయారు. ఆపై ఆమె మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని అడగ్గా మేయర్, కమిషనర్ ఇవ్వలేదు. రమాదేవి విలపిస్తూ వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్‌రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!
-
YouTuber: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్‌పై నెటిజన్ల ఫైర్!
-
TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్!.. విపక్షాల మండిపాటు
-
అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
-
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ