మూడు చోట్ల భూ సేకరణ ప్రతిపాదనల ఉపసంహరణ

విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ కోసం ప్రతిపాదించిన భూములను ప్రభుత్వం మరో మూడు చోట్ల ఉపసంహరించుకుంది.

Published : 04 Jun 2023 03:57 IST

విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ కోసం ప్రతిపాదించిన భూములను ప్రభుత్వం మరో మూడు చోట్ల ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేరుతో శనివారం వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. విజయవాడ అర్బన్‌ మండలం గుణదలలో 4,455.19 చ.గజాలు, మాచవరంలో 1,990.22 చ.గజాలు, మొగల్రాజపురంలో 2,857.64 చ.గజాల స్థలాన్ని భూ సేకరణ ప్రతిపాదనల నుంచి ఉపసంహరించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామ పరిధిలో 3,272.55 చదరపు గజాల భూ సేకరణ ప్రతిపాదనను ప్రభుత్వం గత నెల 29న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు