Heat waves: సన్‌డే.. మండే.. ఏపీలో భగభగలే

రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే మంటలు మొదలవుతుండగా.. ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు.

Updated : 04 Jun 2023 08:23 IST

46 డిగ్రీలకు చేరువైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
నేడు, రేపు పెరగనున్న వడగాడ్పుల తీవ్రత

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే మంటలు మొదలవుతుండగా.. ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు. మరో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.

* శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 45.6, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పు గోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

* విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు