స్థానికులు వెంటనే స్పందించారు

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఖరగ్‌పుర్‌ నుంచి రాజమహేంద్రవరానికి పెళ్లికి వెళ్తున్నా. రైలు అకస్మాత్తుగా తిరగబడింది.

Updated : 04 Jun 2023 06:03 IST

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఖరగ్‌పుర్‌ నుంచి రాజమహేంద్రవరానికి పెళ్లికి వెళ్తున్నా. రైలు అకస్మాత్తుగా తిరగబడింది. పెద్ద శబ్దం వచ్చింది. తలుపు దగ్గర కూర్చున్న వారిలో చాలామంది ఎగిరి పడిపోయారు. అక్కడే చనిపోయి ఉండొచ్చు. సీట్లో కూర్చున్నవారు దెబ్బలతో బయటపడ్డారు. రక్త గాయాలతో హాహాకారాలు చేశారు. ప్రమాదం తర్వాత అధికారుల నుంచి సాయం అందడానికి గంట సమయం పట్టింది. స్థానికులు మాత్రం వెంటనే స్పందించారు. బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీశారు. మంచినీరు తదితర ఏర్పాట్లు చేశారు.

వేణుకుమార్‌


చేయగలిగిన దానికి మించి చేశారు

కోరమాండల్‌లో షాలిమార్‌ నుంచి విశాఖపట్నం వస్తున్నాను. రైలు మొత్తం ప్రయాణికులతో నిండి ఉంది. అధికవేగంతో గూడ్సును ఢీకొట్టింది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. ఒక్కసారిగా తలుపులు మూసుకుపోయాయి. చాలా భయపడ్డాం. ఏం జరిగిందో కాసేపటి వరకూ అర్థం కాలేదు. ప్రమాదం తర్వాత పది నిమిషాల్లోనే చుట్టుపక్కల వారు వచ్చి ఎంతో సహకారం అందించారు. చేయగలదానికి మించి చేశారు. బోగీల కింద చాలామంది చిక్కుకున్నా వారిని మాత్రం తీయలేకపోయారు. జనరల్‌ బోగీల్లోని చాలామంది మరణించారు.

శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని