జమ్ములోని శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ

జమ్ములోని మజీన్‌ గ్రామంలో తితిదే నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

Published : 04 Jun 2023 05:15 IST

తిరుమల, న్యూస్‌టుడే: జమ్ములోని మజీన్‌ గ్రామంలో తితిదే నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్స్యంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ తేదీ ఉదయం 7.30- 8.15 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్‌ రామకృష్ణ దీక్షితులు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్‌రెడ్డి, శివప్రసాద్‌, ఈఈ సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు