మృతుల కుటుంబాలకు.. రూ.10 లక్షలు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ఇది అదనమని పేర్కొన్నారు. రైలు ప్రమాదం, అధికారులు తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ఆదివారం సమీక్షించారు. ఒడిశా వెళ్లిన మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. బాలేశ్వర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించారని, ఆయన తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ దుర్ఘటనలో చనిపోయినట్లుగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ