వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రతకు బిల్లు

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రత కోసం ఒక బిల్లును తెస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు.

Updated : 05 Jun 2023 05:22 IST

కేంద్ర సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రత కోసం ఒక బిల్లును తెస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. గుంటూరు మెడికల్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో ఆదివారం రాత్రి వైద్యులతో నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి బిల్లును రూపొందిస్తామన్నారు. జాతీయ వైద్య కమిషన్‌ చట్టంపై భారత వైద్య సంఘం ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుపై వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకు ముందు గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ వివరాలు హిందీలో ఉన్నందున తమకు పూర్తిగా అర్థం కాలేదని కొందరు తెలపగా... వాటిని ఆంగ్లం లేదా తెలుగులోకి అనువదిస్తామని తెలిపారు. అంతకుముందు ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి ఫణిధర్‌, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు (ఎలక్ట్‌) నందకిషోర్‌ తదితరులు జాతీయ వైద్య కమిషన్‌ చట్టం వల్ల నష్టాలను వివరించారు. కార్యక్రమంలో వైద్యులు, భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు