Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఓ విమానం ఆదివారం ఉదయం 8.00 నుంచి 8.30 గంటల ప్రాంతంలో వెళ్లింది.

Updated : 05 Jun 2023 06:51 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఓ విమానం ఆదివారం ఉదయం 8.00 నుంచి 8.30 గంటల ప్రాంతంలో వెళ్లింది. అయితే ఆ విమానం ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుందో తెలియరాలేదు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్లరాదు. కానీ ఇటీవల అప్పుడప్పుడు ఆలయానికి సమీపంలో వెళుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి విమానయానశాఖ అధికారులను తితిదే విజిలెన్స్‌ అధికారులు సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు