Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వస్తున్న సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో అమలు
‘తితిదే డయల్ యువర్ ఈవో’లో వెల్లడి
తిరుమల, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వస్తున్న సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అన్నమయ్య భవనంలో ‘తితిదే డయల్ యువర్ ఈవో’ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఈవో మీడియాతో మాట్లాడారు. దర్శన టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు దాదాపు 2 రోజులపాటు వేచి ఉండే పరిస్థితి ఉందని, అందుకు అనుగుణంగా ఓపికతో రావాలని సూచించారు. ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల విలువైన పదెకరాల భూమిని తితిదేకు కేటాయించిందని తెలిపారు. ఇక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్లు వెచ్చించనున్నారని తెలిపారు. వేదాల్లోని దాదాపు 190 అంశాలను భావితరాలకు అందించేందుకు శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రాజెక్టు అంశాలను ‘భారతీయ విజ్ఞానదాన’ పేరుతో సోషల్‌మీడియా, ఎస్వీబీసీల ద్వారా పది నిమిషాల వీడియో ప్రసారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
* శ్రీవారి భక్తులకు దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. శనివారం శ్రీవారిని 85,366 మంది భక్తులు దర్శించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన