ఎంఎస్‌వోలపై ఏపీ ఫైబర్‌నెట్ బాక్సుల భారం!
ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా మరో 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకయ్యే భారం కేబుల్ ఆపరేటర్లపై పడనుంది.
మరో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం
ఈనాడు, అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా మరో 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకయ్యే భారం కేబుల్ ఆపరేటర్లపై పడనుంది. బాక్సులను గతంలో ఫైబర్‌నెట్ సంస్థ కొనుగోలు చేసేది. ఇప్పుడు మల్టిపుల్ సిస్టం ఆపరేటర్లు (ఎంఎస్‌వో), లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీవో) కొనుగోలు చేసి వినియోగదారులకు అందించేలా అధికారులు నిర్ణయించారు. ఒక్కో బాక్సుకు సుమారు రూ.4 వేలు అవుతుందని అంచనా. ఈ ఖర్చును ముందే ఆపరేటర్లు భరించి.. ఆ తరువాత అద్దె రూపంలో ప్రతి నెలా రూ.59 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్త బాక్సులు (ట్రిపుల్ ప్లే బాక్సులు) ఎన్ని కావాలో తేల్చడానికి అధికారులు త్వరలో కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. వారి నుంచి వచ్చిన డిమాండు ఆధారంగా బాక్సుల తయారీకి ముందుకొచ్చిన 5 కంపెనీలకు బాధ్యతను అప్పగిస్తామని ఒక అధికారి తెలిపారు. వీటిని 2 నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు వేశారు. సంస్థకు ప్రస్తుతం సుమారు 10 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా 10 లక్షల కనెక్షన్లు ఇస్తే సంస్థ నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు