రోడ్డు కోసం ఆర్డీవోకు పాదాభివందనం

అధ్వాన రహదారిని బాగు చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని గమళ్లపాలెం వాసులు కావలి ఆర్డీవో శీనానాయక్‌ కాళ్లపై పడి వేడుకున్నారు.

Published : 06 Jun 2023 07:08 IST

కావలి, న్యూస్‌టుడే: అధ్వాన రహదారిని బాగు చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని గమళ్లపాలెం వాసులు కావలి ఆర్డీవో శీనానాయక్‌ కాళ్లపై పడి వేడుకున్నారు. పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంనుంచి సోమవారం మండుటెండలో నడిచి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. మహిళలు, వృద్ధులు 60 మంది వరకు భాజపా నాయకులు వడ్డే శ్రీనాథ్‌, కేతిరెడ్డి విష్ణుతేజరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. ఆర్డీవో వారి వద్దకు రాగానే సమస్య పరిష్కరించాలంటూ కాళ్లకు మొక్కారు. రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ఇతర సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆర్డీవో హామీనిచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు