‘ఎల్లో జర్నలిజం-పోరాటం’పై గ్రూపు-1 అభ్యర్థులకు ప్రశ్న

రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ...ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రభావానికి గురవుతోందా? గ్రూపు-1 ప్రధాన పరీక్షలో ‘ఎల్లో జర్నలిజం’ పై ప్రశ్న ఇవ్వడాన్ని చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది.

Updated : 06 Jun 2023 06:19 IST

అధికార పార్టీకి ఏపీపీఎస్సీ బాసటగా నిలుస్తున్నట్లు విమర్శలు

ఈనాడు-అమరావతి: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ...ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రభావానికి గురవుతోందా? గ్రూపు-1 ప్రధాన పరీక్షలో ‘ఎల్లో జర్నలిజం’ పై ప్రశ్న ఇవ్వడాన్ని చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలో సోమవారం ‘ఎల్లో జర్నలిజంపై పోరాటం’ అనే ప్రశ్న ఇచ్చారు. పత్రికల్లో వాస్తవాలు రావడాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి జగన్‌ ఎల్లో జర్నలిజం.. అంటూ పదేపదే మాట్లాడుతున్నారు. దీనికి పార్టీ నేతలు, మంత్రులు వంత పాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తుంటే..జీర్ణించుకోలేక వీరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ ‘ఎల్లో జర్నలిజంపై పోరాటం’ అన్న ప్రశ్న ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యం-సోషల్‌ మీడియా పాత్ర గురించి కూడా ప్రశ్న అడిగారు. 20 మార్కుల కింద ఐదు ప్రశ్నలు ఇచ్చి..ఒక దానికి జవాబు రాయాలన్న విభాగంలో ఈ రెండు ప్రశ్నలూ ఉన్నాయి. గత వారం జరిగిన తెలుగు పరీక్షలో సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం అన్న అంశంపై ప్రశ్న వచ్చింది. మళ్లీ ఇంగ్లిషు పరీక్షలోనూ ఆ ప్రశ్న రావడం గమనార్హం. తెలుగు పరీక్షలో ‘నాడు-నేడు’ కింద చేపట్టిన నిర్మాణాల గురించి ప్రశ్న వచ్చింది. సోమవారం జరిగిన గ్రూపు-1 ప్రధాన పరీక్షను 4,944 మంది రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని