స్పెల్‌ బీ పోటీల్లో ప్రవాస తెలుగు విద్యార్థి ప్రతిభ

అమెరికాలో నిర్వహించిన స్పెల్‌ బీ పోటీల్లో బాపట్ల మండల పరిధిలోని జమ్ములపాలేనికి చెందిన ప్రవాస తెలుగు విద్యార్థి కాపు సూర్యసాయి(14) సత్తా చాటాడు.

Published : 06 Jun 2023 05:07 IST

బాపట్ల, న్యూస్‌టుడే: అమెరికాలో నిర్వహించిన స్పెల్‌ బీ పోటీల్లో బాపట్ల మండల పరిధిలోని జమ్ములపాలేనికి చెందిన ప్రవాస తెలుగు విద్యార్థి కాపు సూర్యసాయి(14) సత్తా చాటాడు. యూటా రాష్ట్రంలోని సౌత్‌ జోర్డాన్‌ నగరానికి చెందిన సూర్యసాయి.. 1.10 కోట్ల మందితో పోటీ పడి స్పెల్‌ బీలో మూడో స్థానం సాధించాడు. బాలుడి తల్లిదండ్రులు ఉదయభాస్కర్‌, హిమబిందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సూర్యసాయిని అమెరికా అధ్యక్ష భవనంలో అధికారులు సత్కరించి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. దీంతో జమ్ములపాలెంలో సూర్యసాయి తాత కాపు అంకమ్మ చౌదరి ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు