ఆ కూలీకి పరిహారం చెల్లించాల్సిందే
ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణించే కూలీలకు రిస్క్ కవర్ (నష్ట బీమా) ప్రీమియం చెల్లించని కారణంగా, మరోవైపు అందులో అనధికారికంగా ప్రయాణిస్తున్నందున ప్రమాదంలో మృతిచెందిన ఓ కూలీకి తాము నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఓ బీమా సంస్థ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
బీమా సంస్థకు హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణించే కూలీలకు రిస్క్ కవర్ (నష్ట బీమా) ప్రీమియం చెల్లించని కారణంగా, మరోవైపు అందులో అనధికారికంగా ప్రయాణిస్తున్నందున ప్రమాదంలో మృతిచెందిన ఓ కూలీకి తాము నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఓ బీమా సంస్థ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రమాదం చోటు చేసుకున్న నాటికి ట్రాక్టర్, ట్రాలీకి ఇన్సూరెన్స్ ఉందని గుర్తుచేసింది. మృతుడి కుటుంబ సభ్యులకు 6 శాతం వడ్డీతో రూ.4.68 లక్షల పరిహారం రెండు నెలల్లో చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. మోటారు వాహనాల ప్రమాద బీమా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. మరోవైపు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం నిరూపణ అయిన నేపథ్యంలో మృతుని కుటుంబ సభ్యులకు చెల్లించిన సొమ్మును ట్రాక్టర్ యజమాని నుంచి రాబట్టుకోవాలని బీమా సంస్థకు సూచించింది. దావా దాఖలు చేయకుండా నేరుగా ‘ఎగ్జిక్యూషన్ పిటిషన్’ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.
ట్రాక్టర్ ట్రాలీలో ఎండుగడ్డి లోడుతో ఉమ్మడి కడప జిల్లా పూత చిన్నాయపల్లె గ్రామంలో దించేందుకు కూలీలతో వెళుతున్న ట్రాక్టర్.. కొప్పోలు క్రాస్ రోడ్డు వద్ద 2011 ఫిబ్రవరి 3న ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న డి.చిన్నసుబ్బారాయుడు అదేరోజు కన్నుమూశారు. ఆయన భార్య కడపలోని మోటారు ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి రూ.10 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ సంస్థ కౌంటర్ దాఖలు చేస్తూ.. చిన్నసుబ్బారాయుడు అనధికారికంగా ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నందున ఆయన పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తమపై లేదంది. విచారణ జరిపిన ట్రైబ్యునల్.. ట్రాక్టర్ యజమాని, బీమా సంస్థ ఇరువురూ కలిపి రూ.4.48 లక్షలు మృతుని కుటుంబ సభ్యులకు చెల్లించాలని 2012 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ.. న్యూ ఇండియా కంపెనీ 2013లో హైకోర్టును ఆశ్రయించింది. యజమాని ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణించే కూలీలకు బీమా చెల్లించని కారణంగా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి విచారణ జరిపారు. రూ.4.68 లక్షల పరిహారం చెల్లించాలంటూ ట్రైబునల్ ఉత్తర్వులు సహేతుకంగా ఉన్నాయన్నారు. పరిహారాన్ని బీమా సంస్థ చెల్లించాలని, ఆ తర్వాత ట్రాక్టర్ యజమాని నుంచి రాబట్టుకోవడానికి పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు
-
ODI World Cup: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అగర్ ఔట్.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి చోటు